టాప్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ప్రస్తుతం పుష్ప 2(Pushpa-2) సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గరకి వచ్చేసింది. ఇంకా కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంది. గత 5 ఏళ్ళు గా ఈ ప్రాజెక్ట్‌తోనే ట్రావెల్ అవుతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్(Allu arjun) కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అనంతరం కొన్ని రోజులు గ్యాప్ తీసుకోనున్నాడు సుకుమార్. తర్వాత రామ్ చరణ్‌తో(Ram charan) సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్సీ17(RC17) అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌కు(Heroine) సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని(Sai pallavi) తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్‌తో ఫస్ట్ జోడి కట్టబోతుంది సాయి పల్లవి.
టాప్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ప్రస్తుతం పుష్ప 2(Pushpa-2) సినిమాతో బిజీగా ఉన్నాడు.
Share This
