తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఈరోజు సిట్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని బండి సంజయ్ గతంలో ప్రకటించారు.
సిట్ అధికారులు ఆ ఆధారాలను సంజయ్ నుంచి సేకరించనున్నారు. ఈ కేసులో ఆయన నుంచి పూర్తి వివరాలు, సమాచారాన్ని సేకరించి తదుపరి విచారణ కొనసాగించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, బండి సంజయ్ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More : ములుగు–వరంగల్ రహదారిపై వంతెన కుంగిపాటు

One thought on “విచారణకు బండి సంజయ్ హాజరు !”
Comments are closed.