సాధారణంగా సినిమాలకు ప్రచారం అంటే ఇంటర్వ్యూలు, ఈవెంట్లు వరకే పరిమితమవుతుంటాయి. కానీ ‘వార్ 2’ మూవీ ప్రమోషన్‌కు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఓ సరికొత్త మాదిరిని చూపిస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య సోషల్ మీడియాను ఊపేస్తున్న బిల్‌బోర్డు సవాళ్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాత్రను హైలైట్ చేస్తూ ఒక భారీ బిల్‌బోర్డ్‌ను హృతిక్ ఇంటికి పంపించారు. దానిపై “ఘుంగ్రూ టూట్ జాయేంగే, పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పావోగే” అనే సవాలు ఉంది. ఇది ‘వార్’ చిత్రంలోని ఘుంగ్రూ పాటను ఉద్దేశించి సరదాగా పెట్టిన డైలాగ్.
ఈ సవాల్‌కు హృతిక్ రోషన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తన పాత్రను ప్రదర్శించే బిల్‌బోర్డ్‌ను ఎన్టీఆర్ ఇంటికి పంపుతూ “మీరు ‘నాటు నాటు’ ఎంత చేసినా, ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే” అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తక్షణమే స్పందిస్తూ, “నైస్ రిటర్న్ గిఫ్ట్ హృతిక్ సర్” అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. ఇక్కడ ‘నాటు నాటు’ పాట ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ కాగా, ‘ఘుంగ్రూ’ హృతిక్ నటించిన వార్ సినిమా హిట్ సాంగ్.
ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ ఫ్రెండ్లీ ప్రమోషన్ వార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో ఎన్టీఆర్‌కు ఇదే డెబ్యూట్ సినిమా కావడం విశేషం.
అత్యధిక అంచనాల మధ్య రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read More : హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రోమో వైరల్
