ధర్మస్థలలో మీడియా ప్రతినిధులపై దాడి: ప్రకాష్ రాజ్ ఖండన

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరిగిన హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సామూహిక అంత్యక్రియలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దివంగత సౌజన్య నివాసానికి సమీపంలో జరిగింది.

మీడియా ప్రతినిధులపై దాడి
మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా గమనించిన కొంతమంది వ్యక్తులు, వారు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు యూట్యూబర్‌ల కెమెరాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి జనసమూహాన్ని చెదరగొట్టారు. గాయపడిన మీడియా ప్రతినిధులను ఆసుపత్రికి తరలించారు.

ప్రకాష్ రాజ్ ఆగ్రహం
ఈ దాడిని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, “ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే పవిత్రమైన ధర్మస్థలంకు కళంకం వస్తోంది” అని మండిపడ్డారు. సౌజన్య హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ హత్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి నిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

One thought on “ధర్మస్థలలో మీడియా ప్రతినిధులపై దాడి: ప్రకాష్ రాజ్ ఖండన

Comments are closed.