టెస్ట్ క్రికెట్‌లో అర్ధశతకాల పరంగా అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వెనకేసుకు వస్తున్నాడు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక అర్ధశతకాల జాబితాలో సచిన్ టెండూల్కర్ 68 అర్ధశతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక జో రూట్ 67 అర్ధశతకాలతో అతనికి అతి చేరువలో ఉన్నాడు. కేవలం ఒక అర్ధశతకం సాధిస్తేనే సచిన్ రికార్డును సమం చేస్తాడు. రెండు అర్ధశతకాలు చేస్తే రూట్ టెండూల్కర్‌ను అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తాడు.
ఈ జాబితాలో 66 అర్ధశతకాలతో శివనారైన్ చాందర్‌పాల్ మూడో స్థానంలో ఉండగా, 63 అర్ధశతకాలతో రాహుల్ ద్రవిడ్, అలన్ బోర్డర్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. 62 అర్ధశతకాలతో రికీ పాంటింగ్ తరువాతి స్థానంలో నిలిచాడు.
జో రూట్ ఈ రికార్డు జాబితాలో సచిన్‌ను చేరుకునే దిశగా దూసుకెళ్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రూట్ ప్రస్తుత ఫార్మ్‌ను పరిశీలిస్తే సచిన్ రికార్డును అధిగమించడం సమయానుసారమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : డివిలియర్స్ మాస్టర్‌క్లాస్.. 12 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయం


One thought on “సచిన్ రికార్డుకు అతి చేరువలో జో రూట్”
Comments are closed.