ఎమ్మెల్సీ అనంతబాబు పై విచారణ ముమ్మరం అవుతోంది. డ్రైవర్ హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే SIT అధికారులు విచారణను ప్రారంభించి, అనంతబాబుకు సహకరించిన వ్యక్తులపై దృష్టి సారించారు. కీలక ఆధారాలను సేకరించే దిశగా దర్యాప్తు జరుగుతుందని సమాచారం. 90 రోజుల్లో విచారణను పూర్తి చేయాలని SIT ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది.
Read More : నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
