ఒడిశా: 15 ఏళ్ల హాకీ క్రీడాకారిణిపై సామూహిక అత్యాచారం

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల యువ హాకీ క్రీడాకారిణిపై నలుగురు హాకీ కోచ్‌లు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన రాష్ట్రంలోని రూర్కెలా ప్రాంతంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) శిక్షణా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, బాధిత యువతి గత రెండేళ్లుగా సాయి సెంటర్‌లో శిక్షణ పొందుతోంది. జూలై 3న సాయంత్రం శిక్షణ అనంతరం నలుగురు కోచ్‌లు ఆమెను స్థానికంగా ఉన్న ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని సమాచారం. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

జూలై 21న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే స్పందించి నలుగురిని అరెస్ట్ చేసింది. వారిపై భారతీయ న్యాయసంహిత (BNS)లోని పలు సెక్షన్లు మరియు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని సోమవారం నాడు కోర్టులో నమోదు చేశారు.

ఈ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలని సమాజం మద్దతు ప్రకటిస్తోంది.

read More : అన్షుల్ ని ఎలా ఎంపిక చేస్తారు..? – సెలెక్టర్లపై ఫైర్