మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పర్మిషన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అయితే, ఈ పర్యటనపై వారు కొన్ని కఠిన నిబంధనలు విధించారు. హెలిప్యాడ్ వద్ద గరిష్ఠంగా 30 మంది మాత్రమే అనుమతితో ఉండాల్సిందిగా పోలీసు శాఖ స్పష్టం చేసింది. అదే విధంగా, మొత్తం పర్యటనలో 500 మందికి మించని జనసందోహాన్ని మాత్రమే అనుమతిస్తూ, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం పర్యటన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు ఆ నిబంధనల మేరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Read More : అల్లూరి జిల్లాలో గిరిజనుల ప్రాణపాయ ప్రయాణం

One thought on “మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పర్మిషన్

Comments are closed.