అనంతపురంలో శోభాయమానంగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. భక్తుల మధ్య రథాన్ని దర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆయన, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొనియాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం, పరిపాలనా నైపుణ్యం, దూరదృష్టి కలిగిన నాయకుడు అధికారంలో ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని సుమన్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్న సుమన్… “ఆయనే నా తొలి రాజకీయ గురువు. ఆయన సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను,” అంటూ చంద్రబాబుతో ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. విజయవంతమైన నాయకుడిగా ఆయన అనుభవంతో అమరావతి రాజధానిని త్వరితగతిన పూర్తి చేస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు.
తన రాజకీయ రీ ఎంట్రీపై కూడా స్పష్టత ఇచ్చిన సుమన్… “తొలిసారిగా వాజ్పేయి, చంద్రబాబు హయాంలోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే, తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉన్నాను. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు” అని పేర్కొన్నారు.
Read More : తడబడిన హిందీ నుంచి ఆత్మవిశ్వాసం వరకు : Janhvi Kapoor
