సింహాచలంలో భారీ ప్రమాదం తప్పింది

విశాఖపట్నం: సింహాచలం హిల్స్‌ ప్రాంతంలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా వేసిన భారీ షెడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటన సింహాచలం తొలి పావంచ వద్ద చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో భక్తులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అధికారులు తెలిపారు.

భక్తుల కోసం వేసిన ఈ తాత్కాలిక షెడ్‌ కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెడ్‌ హోల్స్ వద్ద కాంక్రీటు సరైన స్థాయిలో వేయకపోవడంతోనే ఇది కూలిపోయినట్టు వారు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు సమీక్ష చేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Read More : గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరైన కొడాలి నాని

One thought on “సింహాచలంలో భారీ ప్రమాదం తప్పింది

Comments are closed.