మినీ బస్సు : ఒకరు మృతి, 10 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లా ఘోత్తీర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు. అదనంగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రాహదారి ప్రమాదాల నివారణ విభాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు అక్కడకు చేరుకొని గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారి కోసం నదిలో మతిల్లు గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు కానీ, వాహనానికి బ్రేక్ ఫెయిల్యూర్ లేదా మలుపు వద్ద అదుపు కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైనవారిని త్వరగా కనుగొనాలని, బాధితులకు తక్షణ సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ విషాదకర ఘటన మరోసారి పర్వత ప్రాంతాల్లో రవాణా భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Read More : భారత్‌ స్పష్టమైన నిర్ణయం ? పాక్‌ మరోసారి చర్చల ప్రస్తావన