కాజల్ అగర్వాల్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనుందా?

కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేయబోతున్నారని Tollywood వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో ఒక హిందీ వాణిజ్య చిత్రాన్ని రూపొందించేందుకు ఆమె పలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు సమాచారం. ఇందులో కాజల్ స్వయంగా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

‘మగధీర’, ‘చందమామ’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు పొందిన కాజల్, గౌతమ్ కిచ్లుతో పెళ్లి, తరువాత కుమారుడి జననం తర్వాత కెరీర్‌ను నిదానంగా కొనసాగిస్తోంది. ఇటీవల ‘ఇండియన్ 3’, ‘కన్నప్ప’ తప్పగా, ఆమె నుంచి పెద్ద సినిమాలు రాలేదు. నటనలో అవకాశాలు తగ్గడంతో, బ్రాండ్ ప్రమోషన్స్, వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో ఆమె దర్శకత్వ బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది రిస్క్‌తో కూడిన నిర్ణయం అని ఆమెకు సన్నిహితులు భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్న ఆమె కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. సినిమా ప్రారంభమైనా, ఆగిపోయినా… కాజల్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ఈ కొత్త ప్రయోగం విజయవంతమైతే, ఆమె కెరీర్ మరో మలుపు తిరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై కేసు, ఆమె క్లారిటీ వీడియో వైరల్‌.

One thought on “కాజల్ అగర్వాల్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనుందా?

Comments are closed.