హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
సినిమాలో సముద్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోగా, ట్యాంక్‌లోని నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో లొకేషన్ మొత్తం జలమయమైంది. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా, మరికొంత మంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాదానికి గురైనవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చిత్రబృందం వెంటనే స్పందించడంతో మిగిలిన వారికి ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ఈ ఘటనపై చిత్ర యూనిట్, షెడ్యూల్‌లో జాప్యం తప్పదని తెలిపింది. మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.
Read More : నటుడిగా బిరుదులకు మించి సేవే పెద్దది

One thought on “నిఖిల్ ‘ది ఇండియన్ హౌస్’ షూటింగ్‌లో ప్రమాదం”
Comments are closed.