మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు బయలుదేరిన ఓ పెళ్లి బృందం విషాదంలో చిక్కుకుంది. కొండగట్టు వద్ద డీసీఏం వ్యాన్ పెళ్లి బృందం కారును డీకొట్టిన దుర్ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి కొడుకు మహేష్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృత చిన్నారి రుద్ర వయసు మూడేళ్లు మాత్రమే.
ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో వివాహ వేడుక జరగాల్సి ఉండగా, ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి సందడిలో జీవితాలను బలిగొన్న ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు చీల్చింది.
Read More : జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు

One thought on “కొండగట్టు వద్ద పెళ్లి బృందం వాహనం ప్రమాదం”
Comments are closed.