కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మైసూరు శాండల్ సబ్బులు, శ్రీ గంధమ్ వంటి రాష్ట్రపు గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రముఖ సినీ నటి తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కన్నడ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఈ ఉత్పత్తుల ప్రచారానికి తమన్నాను ఎంపిక చేయడంపై కర్ణాటక ఎంపీ శ్రీ కృష్ణదత్త ఒడేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, తమ పూర్వీకుడు మహారాజ కృష్ణరాజ ఒడేయర్ 1916లో స్థాపించిన మైసూర్ శాండల్ వర్క్స్‌కు సంబంధించి పరభాషా నటిని ప్రచారకర్తగా నియమించడం రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే విషయం అన్నారు.
“తమన్నాకు కన్నడ భాష రాదు, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేదు. అలాంటి వారిని రూ.6.2 కోట్ల పారితోషికంతో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ఏమిటి?” అంటూ ఎంపీ మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. “కర్ణాటకలో ఎంతో మంది స్థానిక కళాకారులు ఉన్నారు. వారిలో ఒకరికి అవకాశం ఇవ్వకుండా ఇతర భాష నటిని ఎందుకు ఎంపిక చేసారు?” అనే ప్రశ్నలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇక ఈ వివాదానికి సంబంధించి అధికార పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అయితే, తమన్నాను ఎంపిక చేయడంలో ఉన్న వ్యూహాత్మకత, మార్కెట్ వ్యాప్తిపై ప్రభుత్వం ఎంతవరకు న్యాయీకరణ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read More : సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు.

2 thoughts on ““కన్నడ రాని వారికి స్థానం ఎందుకు?””
Comments are closed.