నల్లమల అడవుల్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి తన బిడ్డను రక్షించేందుకు చేసిన పోరాటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే, నల్లమల అడవుల్లో దట్టమైన పొదల్లో ఓ పెద్దపులి సంచరిస్తుండగా, అక్కడే ఉన్న ఓ ఎలుగుబంటి పిల్లను చూసి దానిపై దాడికి సిద్ధమైంది.
అయితే, ఆ బిడ్డను గమనించిన తల్లి ఎలుగుబంటి వెంటనే అక్కడికి చేరుకుని, తన శక్తివంచన లేకుండా పెద్దపులితో సమరానికి దిగింది. ఒకదశలో తీవ్రంగా సాగిన ఈ తలుపోరులో ఎలుగుబంటి ధైర్యంగా ప్రతిస్పందించింది. చివరికి ఎలుగుబంటి దాడులకు తాళలేకపోయిన పెద్దపులి అక్కడి నుంచి వెనుదిరిగి అడవిలోకి పరుగులు పెట్టింది.
తల్లి ప్రేమ ఎంతదాకా వెళ్లగలదో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఈ అరుదైన సంఘటనను కొందరు అడవి అధికారులూ స్థానికులూ తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలకే తెగించే తల్లి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read More : నారా లోకేష్ వైసీపీ గూండాల హత్యకు వెన్నా కుటుంబానికి.

One thought on “పెద్దపులిపై తిరగబడి బిడ్డను కాపాడింది”
Comments are closed.