రాంగ్ రూట్ కేసు – ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసు నమోదు అయ్యింది. అంతేకాదు, ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటన కూడా ఈ కేసులో భాగమైంది.

ఈ నెల 13న రోడ్ నెంబర్ 45 మీదుగా బెల్లంకొండ శ్రీనివాస్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసానికి వెళ్తుండగా చౌరస్తాలో రాంగ్ రూట్‌లోకి ప్రవేశించారు. అప్పటికే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నరేష్, రూట్ తప్పు అని హెచ్చరించినా, హీరో అతని మాటలు పట్టించుకోకుండా కారును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టేలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే కానిస్టేబుల్ సకాలంలో తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. “హీరోలకూ ట్రాఫిక్ రూల్స్ వర్తించవా?”, “ఇలాంటి తప్పులకు కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ స్పందిస్తున్నారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.

Read More : టాలీవుడ్ ఎంట్రీకి ముందే మాళవిక మోహనన్ కు క్రేజ్‌ పెరుగుతోంది!

One thought on “రాంగ్ రూట్ కేసు – ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం

Comments are closed.