భారత్‌లోని కీలక మిలటరీ స్థావరాలపై దాడులకు పాకిస్థాన్ యత్నించగా, భారత బలగాలు అప్రమత్తంగా స్పందించాయి. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను ఉపయోగించి పాక్ విస్తృత దాడులకు ప్రణాళికలు వేసింది. అయితే భారత్ సమర్థంగా ఎదుర్కొంటూ ప్రత్యర్థి చర్యలను తిప్పికొట్టింది.
పాకిస్థాన్ ప్రయోగించిన మిస్సైళ్లను గగనతలంలోనే పేల్చి అణిచివేసిన భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తమ శక్తిని మరోసారి చాటిచెప్పింది. చైనా నుంచి పొందిన BVR మిస్సైల్స్‌తో దాడులకు యత్నించిన పాక్‌కి భారత్ నుండి తీవ్రమైన సమాధానం లభించింది.
జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్‌కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి వంటి ముఖ్యమైన మిలటరీ కేంద్రాలపై పాకిస్థాన్ లక్ష్యంగా పెట్టుకున్న దాడులను భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.
ఈ సాహసోపేత విజయంతో భారత భద్రతా వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



Read More : చొరబాటుకు యత్నించిన పాక్ వ్యక్తిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది..

2 thoughts on “పాకిస్థాన్ దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్.”
Comments are closed.