ప్రగ్యా జైస్వాల్ మోడల్‌గా, హీరోయిన్గా తన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తార. మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె, కంచె సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా ద్వారా ఆమెకు ఫిల్మ్‌ఫేర్ సహా అనేక అవార్డులు లభించాయి.

పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదువుకునే సమయంలోనే అందాల పోటీల్లో విజయం సాధించి, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్ టైటిళ్లను గెలుచుకుంది. 2014లో కళా, సాంస్కృతిక రంగాల్లో సాధించిన ప్రావీణ్యానికి ప్రత్యేక పురస్కారాన్ని అందుకుంది.

తెలుగు ఇండస్ట్రీలో ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ, దాకు మహారాజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మరోవైపు గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి కొన్ని సినిమాలు తక్కువ విజయం సాధించాయి.

ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రగ్యా, ఇంకా కొన్ని సినిమాలను కూడా సైన్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉండి తన ఫ్యాషన్ స్టైల్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.


One thought on “ప్రగ్యా జైస్వాల్: మోడల్ నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన అందాల రేఖ”
Comments are closed.