విదేశీ సినిమాలపై ట్రంప్ పన్ను బాంబ్!

Trump 100% tax on foreign films

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. విదేశీ చిత్రాలపై 100 శాతం పన్ను విధించాలని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు.

విదేశాల్లో తక్కువ ఖర్చుతో సినిమాలు తయారవుతుండడంతో హాలీవుడ్ పోటిలో వెనుకబడుతోందని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని బలహీనపరచే కుట్రలో భాగమని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అభివర్ణించారు.

ఈ నిర్ణయాన్ని అమెరికా వాణిజ్యశాఖ, వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అమలు చేసేందుకు ముందడుగు వేసింది. అయితే ట్రంప్ అభిప్రాయంతో ఎంతో మంది ఏకీభవించట్లేదు. అమెరికన్ సినిమాల నాణ్యత తగ్గుతున్నదే ప్రధాన కారణమని కొందరు విమర్శిస్తున్నారు. అధిక పన్నుల వల్ల టికెట్ ధరలు పెరిగి, ప్రేక్షకులు మరింత వెనకడుగు వేయాల్సి వస్తుందని భావిస్తున్నారు.

ఈ పన్ను విధానం భారతీయ సినిమాలపై, ముఖ్యంగా తెలుగు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తర అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రేక్షకుల వలన ఎన్నో సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఈ మార్పు దిశగా వాణిజ్యశాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారని సమాచారం.

Read More