హైదరాబాద్ మధురానగర్‌లో ఓ పాశవిక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే పవన్ కుమార్ (37) అనే వ్యక్తి, తన పెంపుడు కుక్కతో కలిసి గదిలో నిద్రిస్తున్నాడు. అయితే ఉదయం సమయంలో అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టినా స్పందించలేదు. అనుమానం వచ్చిన అతను పక్కటెమిటి వారిని పిలిచి డోర్ బలవంతంగా ఓపెన్ చేయగా, విపరీతమైన దృశ్యం కనిపించింది.
పవన్ కుమార్ ఆల్రెడీ మృతిచెందగా, శరీరంపై తీవ్ర గాయాలు, మర్మాంగాలు విరిగిపోయినట్లుగా ఉండటంతో దారుణ మృతికి గురైనట్లు అర్థమైంది. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తంతో కనిపించింది. దీంతో యజమానిపై దాడి చేసింది ఇదే అనే అనుమానం వ్యక్తమవుతోంది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇలాంటి ఘటనలు పెంపుడు జంతువులపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
Read More : యువకుడి ఆత్మహత్య

2 thoughts on “హైదరాబాద్‌లో దారుణం”
Comments are closed.