హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థాన్ జాతీయులు నివసిస్తున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ నగరంలో ఉన్న పాకిస్థాన్ జాతీయుల వీసాలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్ జాతీయులు ఈ నెల 27వ తేదీ నాటికి నగరాన్ని వదిలివేయాలని హెచ్చరించారు.
అటారీ సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంటుందని, ఆ తేదీ తర్వాత నగరంలో ఎవరైనా ఉంటే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జితేందర్ స్పష్టం చేశారు.
వైద్య వీసాతో ఉన్న వ్యక్తులకు ఈ నెల 29 వరకు మాత్రమే గడువు కలిగి ఉంటుందని తెలిపారు. అయితే, దీర్ఘకాలిక వీసా కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల ప్రకారం, డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Read More : హైదరాబాద్ హై అలర్ట్

One thought on “హైదరాబాద్: 208 పాకిస్థాన్ జాతీయులకు 27వ తేదీ లోపు…”
Comments are closed.