ఇండియా లెవల్లో జరగనున్న ఓ భారీ కార్యక్రమంలో తెలుగు సూపర్స్టార్లకు గొప్ప గౌరవం దక్కనుంది. ముంబైలో జరగనున్న “ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)”లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మరియు దర్శకధీరుడు రాజమౌళి పాల్గొననున్నారు. వారు తమ కెరీర్ నుంచి సేకరించిన జ్ఞానం మరియు అనుభవాలను పంచుకుంటారు.
ఈ సమ్మిట్లో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారి సహా సౌత్ ఇండియాలోని రజనీకాంత్, మోహన్ లాల్ కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఆడియో విజువల్ రంగంలో విప్లవాలు, వినోద రంగంలో కొత్త మార్పులు పై ప్యానెల్ చర్చలు జరగనుంది.
“లెజెండ్స్ & లెగసీస్” అనే సెషన్లో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు పాల్గొనగా, “ఇండియాస్ క్రియేటివ్ అసెంట్” సెషన్లో అల్లు అర్జున్, జర్మన్ క్రీడాకారిణి అరియాన్ హింగ్స్టూ, ఇటాలియన్ మోడల్ బినాకా బాల్టి పాల్గొంటారు.
సినిమా రంగంలో పలు కీలక అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. “పాన్-ఇండియన్ సినిమా: మిత్ ఆర్ మొమెంటం?” వంటి సెషన్లో నాగార్జున, అమితాబ్ బచ్చన్, కార్తీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం టాలీవుడ్ స్టార్లకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందే ఒక అద్భుత వేదికగా నిలుస్తోంది.

One thought on “టాలీవుడ్ స్టార్లకు అంతర్జాతీయ గౌరవం: వేవ్స్ 2025”
Comments are closed.