బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఈ మధ్య పంచుకున్నారు. 1986లో విడుదలైన ‘భగవాన్ దాదా’ సినిమా షూటింగ్ సందర్భంగా తాను రజనీకాంత్‌తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. హృతిక్ చిన్నపిల్లవాడిగా రజనీ సర్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఆయన చూపించిన మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు.
ఒక ఈవెంట్‌లో పాల్గొన్న హృతిక్, “చిన్నప్పుడు నేను షూటింగ్‌లో తప్పులు చేసినప్పుడు, నా బాబాయి షూట్ కట్ చేసేవారు. అప్పుడు రజనీ సర్ తప్పు తనదని చెబుతూ, ‘సారీ సారీ నా తప్పు’ అని మన్నించేవారు. వాస్తవానికి అది నా తప్పే అయినా ప్రతిసారీ ఆయనే బాధ్యత తీసుకునేవారు” అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘వార్ 2’లో నటిస్తుండగా, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. వీరి రెండూ సినిమాలు ఆగస్టు 14న విడుదల కానుండటంతో బాక్సాఫీస్‌పై భారీ క్లాష్ ఏర్పడబోతోంది. అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవాన్ని చూపిస్తూ, తమ వ్యక్తిగత సంబంధాన్ని ప్రభావితం కాకుండా చూసుకుంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం ఈ క్లాష్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. కానీ ఇప్పటివరకు హృతిక్ లేదా రజనీ సర్ ఏ వ్యాఖ్యలూ చేయలేదు. అభిమానులు మాత్రం ఈ రెండు పెద్ద సినిమాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
