#BRB Begins: ఫ్యూచర్‌లోకి సుదీప్ ఎంట్రీ!

BRB movie shoot begins

ప్రస్తుతం కాలంలోని కథలకు అలవాటుపడిన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ‘బిల్లా రంగ భాష’ సినిమా సిద్ధమవుతోంది. 2209 ఏడీ నేపథ్యంలో సాగనున్న ఈ విభిన్న ప్రయోగంలో కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమై, ఫ్యూచరిస్టిక్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు, ఆరేళ్ల ప్రీ-ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఎట్టకేలకు రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. హాలీవుడ్ స్థాయిలో ఫ్యూచర్‌పై జరిపిన అధ్యయనం ఆధారంగా దర్శకుడు అనూప్‌ భండారి ఓ స్పెషల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథను నిర్మాణ దశ నుంచే హై టెక్నికల్‌ ప్రమాణాలతో రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌ వీడియో, లోగో సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించబడుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘బిల్లా రంగ భాష’లో కిచ్చా సుదీప్‌ పాత్రపై ఇప్పటికే చర్చలు ఊపందుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఓ వైవిధ్యమైన విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.

Read More

One thought on “#BRB Begins: ఫ్యూచర్‌లోకి సుదీప్ ఎంట్రీ!

Comments are closed.