SSMB29: రాజమౌళి ప్లాన్ చేసిన స్పెషల్ సర్‌ప్రైజ్!

SSMB29 Rajamouli Mahesh Babu surprise

గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న SSMB29పై సర్‌ప్రైజ్ సిద్ధమవుతోంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై సినీ ఇండస్ట్రీలో అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి వండర్స్ తరువాత రాజమౌళి తీసుకోనున్న ఈ అడ్వెంచర్ డ్రామా మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంగా నిలవనుంది. జక్కన్న మార్క్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ రాకపోయినా.. ఫ్యాన్స్‌ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కేవలం కొన్ని లొకేషన్ ఫొటోలు, బీహైండ్ ది సీన్ క్లిప్స్‌ మాత్రమే బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో రానుందని బజ్ వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ లుక్‌తో పాటు సినిమాలోని అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తూ, రాజమౌళి స్పెషల్ విజన్‌కు ఊహాజనిత రూపం ఇవ్వనున్నారు.

ఈ గ్లింప్స్ కేవలం టైటిల్ రివీల్‌కు పరిమితం కాకుండా.. భారీ గ్రాఫిక్స్‌తో, వెస్ట్రన్ స్టైల్ మూడ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ విజ్యువలైజేషన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. గ్లింప్స్‌ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జూన్ లేదా జూలైలో రానున్న అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఓ ప్రపంచయాత్రికుడిగా నటించనున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ సమర్పణలో కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More

One thought on “SSMB29: రాజమౌళి ప్లాన్ చేసిన స్పెషల్ సర్‌ప్రైజ్!

Comments are closed.