పాన్ ఇండియా సినిమాల హవా ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి, అలాగే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు అంచనాలు చేరుకోలేకపోతున్నాయి.
ఇక ఈ నేపథ్యంలో తాజాగా, ఒక సినిమా గురించి ఓ నెటిజన్ నెగిటివ్ కామెంట్ చేశాడు. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాకు ఈ కామెంట్ వచ్చి పాపులర్ అయింది. నెటిజన్ చెప్పినట్లుగా, “మీ సినిమా చూడటం కంటే బిర్యానీ ఆర్డర్ చేసి, నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ సినిమా చూసుకుంటా” అని వ్యాఖ్యానించాడు.
ఈ కామెంట్‌పై హీరో ప్రదీప్ మాచిరాజు తనదైన ఫన్నీ శైలిలో స్పందించాడు. “ఏం పర్లేదు భయ్యా ఒకసారి ట్రై చెయ్.. సరదాగా నవ్వుకొని వచ్చేయ్.. చూశాక చెప్పు, భయ్యా బిర్యాని కూడా నేనే పంపిస్తా” అని రిప్లే ఇచ్చాడు.
ప్రదీప్ ఇచ్చిన ఈ షాకింగ్ రిప్లే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిప్లే ద్వారా ప్రదీప్ తన సెన్సే ఆఫ్ హ్యూమర్‌ని చూపిస్తూ నెటిజన్‌కి సమాధానం ఇచ్చాడు.

One thought on “నెగిటివ్ కామెంట్స్‌కు హీరో ప్రదీప్ ఇచ్చిన ఫన్నీ రిప్లే”
Comments are closed.