రాజీవ్ యువవికాసం దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు కారణంగా తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇంటర్నెట్ సేవలు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు తీవ్రంగా పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరి దశకు వెళ్లిన తర్వాత సర్వర్ మొరాయించడం, దరఖాస్తు సమర్పించాక అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడం, తిరిగి మళ్లీ దరఖాస్తు చేసినప్పుడు “అల్రెడీ అప్లై చేసినట్లు” సందేశం వస్తుండటం వంటివి మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలు దరఖాస్తుదారులందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Read More : గ్రూప్-1 ఫలితాల వివాదం : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం నోటీసులు!
