మీడియాపై విరుచుకుపడ్డ జస్టిన్ బీబర్: “డబ్బే మీ లక్ష్యం!”

Justin Bieber angry at paparazzi

ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం తన సంగీత ప్రదర్శనల వల్ల కాదు, మీడియా ఫోటోగ్రాఫర్లపై వ్యక్తపరిచిన ఆగ్రహం వల్ల. ఇటీవల ఓ కేఫ్‌ వెలుపల ఫోటోగ్రాఫర్లు అతడిని ఫోటోలు తీయాలని ప్రయత్నించగా, బీబర్ అసహనానికి గురై వారిపై ఘాటుగా వ్యాఖ్యానించాడు. “డబ్బు కోసం ఏదైనా చేస్తారు మీరు.. మనుషుల గురించి పట్టించుకోరు” అంటూ అతడు పలుమార్లు విమర్శలు గుప్పించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ తన ముఖాన్ని కప్పుకొని కెమెరాల వైపు వెళ్లిపోతూ అసహనంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. డబ్బు, డబ్బు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి బ్రో.. అంటూ ఫోటోగ్రాఫర్లపై తిట్టినట్టు వీడియోలో వినిపిస్తుంది. ఈ ప్రవర్తన చూసిన నెటిజన్లు గాయ‌కుడి మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది బీబర్ ఇలా అసహనంగా ప్రవర్తించిన మొదటి ఘటన కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అతను లాస్ ఏంజిల్స్‌లో భార్య హేలీ బీబర్‌తో కలిసి ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. అప్పుడే అతడు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నాడన్న వార్తలు హాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా బీబర్ హేలీ బీబర్‌తో విడాకుల పుకార్లు కూడా వినిపిస్తున్నా, ఆ జంట వాటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. బీబర్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం చేస్తున్నాడన్న ఊహాగానాలను మాత్రం అతడి ప్రతినిధులు ఖండించారు. అయినా, అతడి ప్రవర్తనలో తేడా కనిపించడమే అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

Read More


One thought on “మీడియాపై విరుచుకుపడ్డ జస్టిన్ బీబర్: “డబ్బే మీ లక్ష్యం!”

Comments are closed.