లడ్డూ మామ సినిమా ప్రయాణం – ఆసక్తికరమైన కథ!

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమాల్లో లడ్డూ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. అసలు లడ్డూ ఎవరో, ఆయన కెరీర్‌ ఎలా మొదలైందో చాలా మందికి తెలియదు. లడ్డూ అసలు పేరు విష్ణు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ బ్యాచ్‌లోనే ఉన్న ఈ యువకుడు, మొదట్లో ఫోటోగ్రాఫర్‌గా, షార్ట్ ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఆయన, ఆ తర్వాత విజయ్ దేవరకొండ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

విష్ణు టాలీవుడ్ ఎంట్రీ విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ సినిమాతో జరిగింది. విజ‌య్ తన సబ్‌జూనియర్ అయిన విష్ణును ట్యాక్సీవాలాలో ఓ పాత్రకు సిఫార్సు చేయడంతో అతడికి లైమ్‌లైట్‌ దక్కింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రామన్న యూత్’, ‘కీడాకోలా’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘సరిపోదా శనివారం’, ‘డార్లింగ్’, ‘మా నాన్న సూపర్ హీరో’ వంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇటీవల ‘మ్యాడ్’ సినిమాతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ కమెడియన్ అవార్డు గెలుచుకున్న విష్ణు, ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. 2025లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నాడు. తన కామెడీ టాలెంట్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న లడ్డూ, టాలీవుడ్‌లో మరో టాప్ కమెడియన్‌గా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More



One thought on “లడ్డూ మామ సినిమా ప్రయాణం – ఆసక్తికరమైన కథ!

Comments are closed.