సత్యరాజ్ ‘అనగా అనగా కథలా’ సాంగ్: మెలోడీ మ్యాజిక్!

Anaga Anaga Katha La Song

మల్టీ టాలెంటెడ్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “త్రిబాణధారి బార్భరిక్”పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పించగా, విజయ్ పాల్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన “అనగా అనగా కథలా” అనే ఫీల్ గుడ్ సాంగ్‌ను టీకేఆర్ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో చైర్మన్ తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు. కార్తీక్ ఆలపించిన ఈ పాట సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది. సనరే రాసిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉంటూ, పాటను మరింత ఆత్మీయంగా మార్చింది. సోషల్ మీడియాలో ఈ పాటకు విశేష స్పందన వస్తోంది.

సత్యరాజ్ తాతయ్యగా, చిన్నారి మనవరాలిగా నటించిన సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తున్నాయి. సాంగ్ రిలీజ్ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ, వేల మంది విద్యార్థుల సమక్షంలో పాట విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స, నిర్మాత విజయ్ పాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. “త్రిబాణధారి బార్భరిక్” మూవీ త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.

Read More

One thought on “సత్యరాజ్ ‘అనగా అనగా కథలా’ సాంగ్: మెలోడీ మ్యాజిక్!

Comments are closed.