SRH vs LSG: మరోసారి పరుగుల వర్షానికి సిద్ధమవుతున్న హైదరాబాద్!

Srh vs lsg

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2025 సీజన్‌లో మరో రన్‌ఫెస్ట్‌కు రంగం సిద్ధమవుతోంది. గురువారం నాడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తమ హోం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants) ను ఎదుర్కోనుంది. ఇదే మైదానంలో ఇటీవల రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) పై SRH చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు అయిన 286 పరుగులు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడగా, లక్నో 3 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, హైదరాబాద్‌కు కేవలం ఒక్క విజయమే ఉంది.

IPL 2025, SRH vs LSG

మరోవైపు లక్నో సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో జరిగిన మ్యాచ్‌లో DC 210 పరుగుల ఛేదనలో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా, అశుతోష్ శర్మ (Ashutosh Sharma) మెరుపు ఇన్నింగ్స్ ఆడి LSG చేతుల్లోని మ్యాచ్‌ను తీయగలిగాడు. గురువారం మ్యాచ్‌కు కూడా LSG ముఖ్యమైన బౌలర్లు అయిన ఆకాష్ దీప్ (Akash Deep), మయాంక్ యాదవ్ (Mayank Yadav) అందుబాటులో ఉండరు. అలాగే మోహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు స్పష్టమైంది. ఇది SRH బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కొనే LSG బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బ. ఒకవైపు ఊరట కలిగించే విషయం ఏమిటంటే, అవేశ్ ఖాన్ (Avesh Khan) తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ ముఖ్యంగా లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తక్షణమే ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో తన LSG డెబ్యూట్‌ (LSG Debut) లో డక్ (Duck) ఔటైన అతడు ఈసారి సత్తా చాటతాడేమో చూడాలి.

SRH vs LSG

గత సీజన్‌లో లక్నో (LSG) vs హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన పోరులో, హైదరాబాద్ లక్నో ప్లేఆఫ్ (Play-off) ఆశలను నాశనం చేసింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే SRH 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరియు ట్రావిస్ హెడ్ (Travis Head) సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఏడాది కూడా SRH జట్టులో వీరిద్దరూ కొనసాగుతుండగా, రీసెంట్‌గా రాజస్థాన్‌పై సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) కూడా జట్టులో చేరాడు. ఇక మిడిలార్డర్‌లో నితీష్ రెడ్డి (Nitish Reddy) మరియు హీన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) వంటి హిట్టర్లు ఉన్నారు. క్లాసెన్ బ్యాటింగ్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read More : ఇంగ్లాండ్ (England) టెస్ట్ సిరీస్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్?