టాలీవుడ్లో కొంత విరామం తీసుకున్నా, బాలీవుడ్లో బిజీగా మారిన పూజా హెగ్డే ఇప్పుడు వరుణ్ ధావన్ సరసన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను రిషికేశ్‌లో పూర్తి చేశారు.
తాజాగా వరుణ్ ధావన్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. అందులో వరుణ్, పూజా ఇద్దరూ పారే నదిలోకి ఒకేసారి దూకడం హైలైట్‌గా మారింది. వరుణ్ పూజా చేతిని పట్టుకుని పరుగెత్తి, ఒక్కసారిగా ఇద్దరూ నదిలోకి జంప్ చేయడం నిజంగా అద్భుతంగా కనిపించింది. ఆ సమయంలో వాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందం, ధైర్యం చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
“జవానీ హై… జంప్ మర్నా హై!! #హైజవానీతోఇష్క్హోనాహై” అంటూ వరుణ్ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ “వామ్మో! ఇంత ధైర్యం?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ సరసన ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా మరో కథానాయికగా నటించనుండటం విశేషం.
మొత్తం మీద, వరుణ్–పూజా జంట తెరపై కాకుండా, ఆఫ్‌స్క్రీన్ కూడా మంచి కెమిస్ట్రీ చూపిస్తూ, సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు.

One thought on “నదిలో దూకిన హీరో-హీరోయిన్! వరుణ్, పూజా ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా”
Comments are closed.