ఒక్కరోజు గ్యాప్‌లో భారీ పోటీ – ‘టాక్సిక్’ vs ‘లవ్ అండ్ వార్’!

Love and War Vs Toxic

2026 మార్చి 20న సినీప్రేక్షకులకు మెగా ఫైట్ ఖాయమైంది! యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ vs రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా వస్తోన్న ‘లవ్ అండ్ వార్’—ఈ రెండు భారీ చిత్రాలు తదుపరి బరిలోకి దిగుతున్నాయి.

‘కేజీఎఫ్’ తర్వాత యశ్ ఎంచుకున్న యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే హై-ఓక్టేన్ ఎంటర్‌టైనర్. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నా, ఇప్పటివరకు విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు మాత్రం ఆశించినంత ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. ఈ కారణంగా సోషల్ మీడియాలో కొంత నెగటివిటీ కూడా ఏర్పడింది. కానీ విడుదల సమయానికి ఈ నెగిటివిటీనీ ఏ మేరకు తిప్పికొడుతుందో చూడాలి.

ఇక రణబీర్-అలియా ప్రధాన పాత్రల్లో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ స్వచ్ఛమైన ప్రేమకథతో పాటు, భారీ యాక్షన్ సన్నివేశాలతో కలిపిన చిత్రం. భన్సాలీ మార్క్ లవ్ స్టోరీ కావడంతో, ఓ వర్గం ప్రేక్షకులు దీన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు చిత్రాల్లో ఒకటి మార్చి 19న, మరొకటి 20న విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయం. పైగా, అప్పట్లో పబ్లిక్ హాలిడేస్ కూడా ఉండటంతో వసూళ్ల పోరులో విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Read More



One thought on “ఒక్కరోజు గ్యాప్‌లో భారీ పోటీ – ‘టాక్సిక్’ vs ‘లవ్ అండ్ వార్’!

Comments are closed.