ఆపిల్ ఇంతకుముందు ప్రకటించిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించిన ఈ ఫీచర్లపై ఆపిల్ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించిందని, అయితే అది పూర్తిగా అబద్ధంపైనే ఆధారపడిందని ఓ కేసులో ఆరోపించారు. ఆపిల్ కంపెనీ తన వినియోగదారులను మోసగించిందని, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల వాస్తవ పరిస్థితిని గోప్యంగా ఉంచి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేసినట్లు కేసులో పేర్కొనబడింది. ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించిన ఈ ఇంటెలిజెన్స్ ఫీచర్లు వాస్తవానికి వినియోగదారులకు అందుబాటులో లేవని, అయినప్పటికీ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ ప్రచారం చేయడం దారుణమని అభిప్రాయపడుతున్నారు.
Read More : iPhone 14 కు వీడ్కోలు, శక్తివంతమైన iPhone 16e బదులుగా వచ్చింది

One thought on “ఐఫోన్ 16 సిరీస్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అబద్ధం? ఆపిల్‌పై కేసు దాఖలు!”
Comments are closed.