కాంపా బ్రాండ్ నుంచి పెరుగుతున్న పోటీకి సమాధానంగా, ప్రముఖ శీతల పానీయాల కంపెనీలు కోకా-కోలా (Coca-Cola) మరియు పెప్సీకో (PepsiCo) తమ నూతన వ్యూహాన్ని అమల్లోకి తెచ్చాయి. తక్కువ ధరలో అధిక మార్కెట్ వాటా సంపాదించేందుకు ఈ కంపెనీలు ₹10 కే నో-షుగర్ మరియు లైట్ బేవరేజ్ ప్యాక్స్ ను విడుదల చేశాయి.
కాంపా బ్రాండ్ గత కొద్ది నెలలుగా భారత మార్కెట్లో తన ప్రాముఖ్యతను పెంచుకుంటోంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు కోకా-కోలా, పెప్సీకో తమ ఉత్పత్తులను మరింత ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాయి. కొత్తగా విడుదలైన నో-షుగర్, లైట్ బేవరేజ్ ప్యాక్స్ ద్వారా ఆరోగ్య పరంగా శ్రద్ధ పెట్టే వినియోగదారులను లభించేలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
పెరుగుతున్న పోటీకి తగినట్లు తమ ఉత్పత్తులను మరింత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం, తక్కువ ఖర్చుతో మంచి పానీయాలను అందించడమే లక్ష్యంగా ఈ దిగ్గజ కంపెనీలు ముందుకెళ్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ తక్కువ ధర ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లో కోల్డ్ డ్రింక్స్ విభాగంలో మరో కొత్త పోటీ దృశ్యాన్ని చూడాల్సి ఉంది.
Read More : ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన దేశంగా ఫిన్‌లాండ్ – వరుసగా ఎనిమిదో సంవత్సరం అగ్రస్థానం
