అయోధ్యలో అమితాబ్ బచ్చన్ ట్రస్ట్ భూసేకరణ: సేవా లక్ష్యంతో కొత్త ప్రాజెక్టు?

Amitabh Bachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆధ్వర్యంలోని హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్ తాజాగా అయోధ్యలో 54,454 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. రామ మందిరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం ఉన్నట్లు సమాచారం.

ఇదివరకు హవేలీ అవధ్ ప్రాంతంలోనూ ట్రస్ట్ భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. రెసిడెన్షియల్ లేదా చారిటబుల్ ప్రయోజనాల కోసం ఈ భూమిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సేవా కార్యక్రమాలను విస్తరించడమే లక్ష్యంగా ట్రస్ట్ దిశగా అడుగులు వేస్తోంది.

హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్, సేవా కార్యక్రమాలకు నిధులు సమీకరించేందుకు, అవసరమైన వారిని ఆదుకునేందుకు ఈ భూమిని వినియోగించనుంది. ఇది అమితాబ్ బచ్చన్ కుటుంబం చేపట్టిన మరో గొప్ప సేవా కార్యక్రమంగా నిలవనుంది.

Read More