2026 సంక్రాంతి బరిలో బడా హీరోలు – భారీ సినిమాల పోటీ ఖాయం!

2026 సంక్రాంతి బరిలో బడా హీరోలు

2025 సంక్రాంతి ఉత్సవాలు ముగిసిన కొన్ని నెలల్లోనే, టాలీవుడ్‌లో 2026 సంక్రాంతి సమరానికి సిద్ధమవుతున్నారు బడా హీరోలు, ప్రొడ్యూసర్లు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ఉద్దేశిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని పొంగల్‌కి రిలీజ్ చేయాలని డైరెక్టర్‌కి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇక సంక్రాంతి సీజన్‌ను ఎప్పుడూ వదులుకోని అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న తన సినిమాను అదే ఫెస్టివ్ సీజన్‌కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ పోటీలోకి నవీన్ పొలిశెట్టి, రవితేజ కూడా తమ సినిమాలతో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో 2026 సంక్రాంతి టాలీవుడ్‌లో భారీ సినిమాల సమరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More

One thought on “2026 సంక్రాంతి బరిలో బడా హీరోలు – భారీ సినిమాల పోటీ ఖాయం!

Comments are closed.