భారత్ నుండి అక్రమ మార్గాలతో అమెరికా చేరిన గ్యాంగ్‌స్టర్లు: ఢిల్లీలో షార్ప్‌ షూటర్ అరెస్ట్

భారతదేశం నుండి కొన్ని కీలక గ్యాంగ్‌స్టర్లు తప్పుడు పాస్‌పోర్టులను ఉపయోగించి అక్రమ మార్గాలతో అమెరికా చేరుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల గోగి గ్యాంగ్‌కు చెందిన హర్ష్ అలియాస్ చింటూ అనే షార్ప్‌ షూటర్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా, గోల్డీబ్రార్‌, అన్మోల్ బిష్ణోయ్‌, రోహిత్ గోడారా, మాంటీ మాన్, పవన్ బిష్ణోయ్ వంటి గ్యాంగ్‌స్టర్లు తప్పుడు పాస్‌పోర్టులు మరియు అక్రమ మార్గాలతో అమెరికా చేరుకుని అక్కడ దాక్కొన్నట్లు వెల్లడించారు.

హర్ష్ భారత్‌లో మరో తప్పుడు పాస్‌పోర్టు పొందేందుకు తిరిగి రాగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి ఢల్లీలో ఓ సెలూన్‌పై కాల్పులు జరిపి ఇద్దరిని హత్య చేసిన ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన విషయం కూడా ఉంది. అతడి పాస్‌పోర్టులో ‘ప్రదీప్ కుమార్’ అని ఉన్నట్లు తెలిసింది, ఇది జలంధర్‌లోనే తయారు చేయబడినట్లు సమాచారం. హర్ష్ జూన్ 9న షార్జాతో మొదలు పెట్టి అజర్‌బైజాన్ చేరుకుని అక్కడ కొన్ని నెలలు గడిపాడు.