చేపల పులుసుతో చైతన్య మమత

నాగచైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా, ఈ సినిమా వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ భాగం విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో జరిగింది.

షూటింగ్ సమయంలో, నాగచైతన్య స్థానికులతో ఆసక్తికరంగా సంభాషించారు. వారి సంప్రదాయాల్లో భాగమైన చేపల పులుసు వండి పెడతానని మాట ఇచ్చారు. తన మాటను నిలబెట్టుకోవడానికి ఓ రోజు ప్రత్యేకంగా చేపల పులుసు వండి, స్థానికులకు వడ్డించారు. ఈ హృద్యమైన సంఘటనకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

One thought on “చేపల పులుసుతో చైతన్య మమత

Comments are closed.