గురుగ్రామ్ బాంబు పేలుడు: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన
గురుగ్రామ్ సెక్టార్ 29లోని ఓ బార్ వెలుపల మంగళవారం నాటి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. పేలుడుకు సంబంధించిన గంగ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనే ప్రకటన విడుదల చేసింది. బాంబు పేలుడు తమ పనేనని వారు ప్రకటించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సచిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరో రెండు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, అతడిని విచారిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గడర్, గోల్డీ బ్రార్ అనే వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రకటన చేశారని సమాచారం. వారు, ఇది చిన్న పేలుడే కదా అని తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించారు. తమకు భారీ విధ్వంసం సృష్టించగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. బార్ యజమాని అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారని, అందుకే అతడిని హెచ్చరించామని తెలిపారు. అందరూ సమయానికి పన్నులు చెల్లించాలని సూచించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగిపోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు తమ పనే అని లారెన్స్ సోదరుడు అన్మోల్ ప్రకటించాడు. దీనితో పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్మోల్ విదేశాలలో తల దాచుకుంటున్నాడు. జైలులో ఉండి కూడా లారెన్స్ బిష్ణోయ్ సెల్‌ఫోన్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది.
