ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే, మనిషి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో అనేక దుర్ఘటనలు, చిరుతిండ్ల కారణంగా చాలామంది అనవసరమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటున్నారు. ఇంకా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా విస్తరించాయి. చిన్న పిల్లలు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్య నిపుణులు సూచించే ఆరు ముఖ్యమైన టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం:
- ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, జీలకర్ర మరియు పంచదార కలిపి తినడం వల్ల కడుపు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
- యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నవారు, ఒక గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడిని కలిపి తాగడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
- దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు, అల్లం ముక్కను బాగా ఎండబెట్టి పొడిగా చేసి, ఆ పొడిలో చిటికెడు జీలకర్ర పొడి మరియు పంచదార కలిపి తింటే, దగ్గు త్వరగా తగ్గి ఉపశమనం కలుగుతుంది.
