కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు

బీసీల హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రముఖ నేతలు హాజరయ్యారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా ఢిల్లీకి చేరుకుని బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ – “బీసీ రిజర్వేషన్ల కోసం చివరి వరకు పోరాడతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలాంటి నాయకుల కుట్రలను సహించం” అని స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే సందర్భంలోనే కిషన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటే చర్చ జరిగేదని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ముస్లింల పేరుతో బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. ఆయనను బహిరంగ చర్చకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

పొన్నం మాట్లాడుతూ – “లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్షీణంగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారు. రిజర్వేషన్లను అడ్డుకుంటే, రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పద” అని వ్యాఖ్యానించారు.

Read More : 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి నిరాకరణ