భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఆసుపత్రిలో మరణించారు. ఆయన అంత్యక్రియలు శనివారం, డిసెంబర్ 28, 2024న అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
అయన మృతికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ కాలంలో అధికారిక కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది.
మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పలువురు ప్రస్తావించారు.
